బొంబాయి రవ్వ - 1 కె.జి
పుట్నాలు - 1/2 కె.జి
ఎండు కొబ్బరి - 1/2 కె.జి
బెల్లం - 1 కె.జి
యాలకులు 1 100 గ్రా.
జీడిపప్పు - 25 గ్రా.
గోధుమపిండి - 1/2 కె.జి
మైదా - 1/2 కె.జి
పుట్నాలు - 1/2 కె.జి
ఎండు కొబ్బరి - 1/2 కె.జి
బెల్లం - 1 కె.జి
యాలకులు 1 100 గ్రా.
జీడిపప్పు - 25 గ్రా.
గోధుమపిండి - 1/2 కె.జి
మైదా - 1/2 కె.జి
ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి.పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకోవాలి.బెల్లం సన్నగా తురమాలి.ఎండు కొబ్బరి తురుముకోవాలి.యాలకులు పొడి చేసుకోవాలి.జీడిపప్పు దోరగా వేయించుకుని చిన్నచిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.ఒక పెద్ద ప్లేటులో ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి.గోధుమ పిండి,మైదా కలిపి ఒక ప్లేటులో పోసి మధ్యలో గుంట చేసి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ గట్టిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.కాస్త కాస్త పిండి తీసుకుని పెద్ద చపాతీ చేసుకుని కజ్జికాయల చెక్కకు నూనె బాగా రాసి దానిపై చపాతీ పెట్టి లోపలకు కొంచెం నొక్కినట్లుగా చేసి దానిలోరెండు టేబుల్ స్పూనుల పొడివేసి వేళ్ళతో అంచులకు బాగా నీళ్ళు రాసి గట్టిగా నొక్కి మూసేయ్యాలి.అంచుల బయటకు వచ్చిన చపాతీని తీసేయాలి.ఒక ప్లేటుకు పలుచగా నూనె రాసి దానిలో తయారు చేసుకున్న కజ్జికాయలు పెట్టుకుని ఒక్కొక్కటి తీసి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.అంతే రుచికరమైన కజ్జికాయలు తయరయినట్లే.ఇవి 10-15 రోజులు నిల్వ ఉంటాయి.
గమనిక:పొడి కలిపి పెట్టుకుని కావలసినన్ని చేసుకుని మిగిలిన పొడిని ఫ్రిజ్ లో జిప్ లాక్ కవర్లో పోసి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.గోధుమ,మైదా 1:1 కొలతతో ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు.
No comments:
Post a Comment